బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాధ్వి కన్నుమూశారు. నవంబరు 19 ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గాధ్వి ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే ఆయనకు అనారోగ్యం ఏమీ లేదని, బహుశా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నామని తెలిపారు.