శబరిమలలో అయ్యప్ప భక్తులు నరకం చూస్తున్నారు. అత్యంత నిష్టగా దీక్ష ఆచరించి, స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా పోటెత్తుతుండటంతో... శబరిమలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆలయం దగ్గరే కాదు... చుట్టూ ఎటుచూసినా రద్దీ కనిపిస్తోంది. శబరిమలకు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్స్‌తో కాలు తీస్తే కాలు కదపలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతిరోజూ వేలల్లో భక్తులు వచ్చేవారు. కానీ, ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా లక్షల్లోకి చేరింది. దాంతో, భక్తులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడంలేదు. ఒక్కసారిగా ఉప్పెన ముంచుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది శబరిమలలో!