పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే వైద్యులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు. ఇటీవల రకరకాల ఫ్రూట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న పండ్లలో గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్నే అడవి కాకర అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ పండ్లు ఆరెంజ్, ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.