సరిహద్దుల్లో బంకర్లను ఊడ్చి శుభ్రం చేస్తున్న మహిళలు.. ఎందుకంటే @Tv9telugudigital

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ తూట్లు పొడుస్తూ దాడులకు పాల్పడుతుంది దీంతో ప్రజలు మళ్లీ బంకర్లను ఆశ్రయిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో కొన్నాళ్లుగా ఉపయోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ను నమ్మలేమని త్రేవా గ్రామ సర్పంచ్‌ బల్బీర్‌కౌర్‌ తెలిపారు. 2018 తర్వాత తమ గ్రామాలపై మోర్టార్‌ దాడులు జరిగాయని బంకర్లను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో వాటిలో ఆశ్రయం పొందలేకపోయామని అన్నారు.