ఏంటి వీళ్ల పెళ్లి అయిపోయిందా Tamannaah Vijay Varma - Tv9

తమన్నా, విజయ్‌ వర్మ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అందరికీ తెలుసు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుసు. కానీ ఈ తెలిసిన విషయాన్ని కాస్త ప్లిప్ చేసి చెబుతున్నారు కొందరు నెటిజన్లు. వారికి పెళ్లి అయిందని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ప్రూఫ్‌ అంటూ.. ఓ వీడియోను కూడా.. షేర్ చేస్తున్నారు. వీడియో చూశారుగా.. అదేంటి వాళ్ల పెళ్లి వీడియోలా అనిపించట్లేదు కదా అంటారా? మీకే కాదు.. నాకు కూడా అనిపించట్లేదు. కానీ ఈ వీడియోలో తమన్నా సారీలో.. విజయ్‌ వర్మ సూట్లో.. చిలకా గోరికంలా అనిపించడం.. ఆ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండడంతో.. కొంత మంది నెటిజన్లు వీరి పెళ్లి వీడియోలా ఉందంటూ.. ఈ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ చేస్తున్నారు.