నాలుగు రోజులుగా బెంగళూరును హడలెత్తించిన చిరుత కథ విషాదాంతమైంది. దాన్ని పట్టుకొని, తరలించే క్రమంలో మృతి చెందింది. వైట్ ఫీల్డ్, బొమ్మనహళ్లి, కూడ్లు, సింగసంద్ర, సోమసుందర;i ప్రాంతాల్లో ఆదివారం నుంచి సంచరించిన చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బండేపాళ్య వద్ద బుధవారం కనిపించిన చిరుతను బంధించేందుకు వెళ్లిన అటవీ శాఖ ఉద్యోగి ధనరాజ్‌పై దాడి చేసింది.