దొంగతనానికి వెళ్లే దొంగలు దొరికిపోకూడదని బోలెడు ప్లాన్లు వేసుకుంటారు. కంటిమీద కునుకు రాకుండా సమయం కోసం చూస్తుంటారు. కానీ ఓ దొంగ ఇంటికి దొంగతనానికి వెళ్లి.. హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. చైనాలో జరిగిన ఈ సరదా ఘటనలో తర్వాత ఏమైందంటే..? స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఒక ఇంట్లో దోచుకునేందుకు ఓ దొంగ ప్లాన్ వేశాడు. దాని ప్రకారమే రాత్రి ఆ ఇంటికి చేరుకున్నాడు. కానీ అతడు వెళ్లేసరికి ఇంట్లో ఇంకా ఎవరూ నిద్రపోలేదు. వారు నిద్రపోయేవరకు ఆ ఇంటిలోని ఒక గదిలోనే సిగరెట్ తాగుతూ వెయిట్ చేసాడు. అక్కడితో ఆగితే.. తెల్లారేలోపు అతడికి మెలకువ వచ్చుంటే ఇల్లు దోచుకోవడమే లేక ఎవరికంటా పడకుండా జారుకోవడమో జరిగేది.