చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటుచేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజ్‌ బాలిక మెరుగైన వైద్యం అందక చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.