సాయుధ మూకల నరమేధం.. 160 మందికి పైగా మృతి - Tv9

మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు రెచ్చిపోయాయి. కొన్ని గ్రామాలను లక్ష్యంగా చేసుకొని వరుస కాల్పులతో నరమేదం సృష్టించాయి. ఈ కాల్పుల్లో 160 మంది మృతి చెందారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.