గాల్లో ఊగిపోయిన విమానం.. ప్రాణ భయంతో ప్రయాణికులు.. - Tv9

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో విమానం సోమవారం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరింది.