ధనస్సు రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం చతుర్ధ స్థానంలో శని అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం. అయితే ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు కలత్రంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా ధనస్సు రాశికి తృతీయ స్థానంలో రాహువు భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనస్సు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబంలో అలాగే మీరు వృత్తి ఉద్యోగాలు కొంత ఉన్నప్పటికీ గురుబలం చేత మీ యొక్క సమస్యలనుండి బయటకు వస్తారు. ధనస్సు రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రమే మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ధనస్సు రాశికి ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగా ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి.