కాగజ్‌నగర్ మండలంలోని అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశు వులపై పులి దాడిచేసింది. పశువులను మేపుతున్న పశువుల కాపరి గులాబ్ ఒక్కసారిగా పులిదాడి చేయడం చూసి కేకలు వేశాడు. అప్పటికే పులి పశువుల కాపరి గులాబ్‌పై దాడిచేసింది. పులిదాడిలో ఆయన చేయి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.