ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు జలకళ వచ్చింది. ఎటు చూసినా నీటితో కళకళలాడు తోంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురిచేస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరడంతో నీటితో నిండుగా ఉంది.