ఒకరి దుర్మరణం, ఐదుగురి గల్లంతు..! @Tv9telugudigital

అమెరికా దేశానికి చెందిన ఓ సైనిక విమానం జపాన్‌ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్‌ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మిగతా ఐదుగురికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.