గాయాలతో ఏనుగు పిల్ల మృతి..తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏం చేసిందంటే.. - Tv9

ప్రమాదవశాత్తు గాయాలపాలైన ఓ ఏనుగుపిల్ల మృతిచెందింది. రోడ్డు పక్కన కదలకుండా పడిఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిన తల్లి ఏనుగు బిడ్డ మృతదేహం చుట్టూ తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. వచ్చీ పోయే వాహనాలనుంచి తన బిడ్డను కాపాడుకోవాలనుకుందో ఏమో వాటిపై దాడికి దిగింది. వాహనాలు గున్న ఏనుగువైపు రాకుండా తరిమి కొట్టింది. దీంతో రోడ్డుకు ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.