పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ కలకలం సృష్టించింది. సాధారణంగా పార్సిల్‌లో ఏమైనా వస్తువులు వస్తాయి కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యండగండిలో మాత్రం ఓ పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. ఇది చూసిన వారు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యండగండిలో పార్శిల్‌గా ఓ వ్యక్తి డెడ్ బాడీ వచ్చింది. జగనన్న కాలనీలో ఇంటిని నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళకు ఈ పార్సిల్ వచ్చింది.