సలార్ మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. బాక్సాఫీస్ ముందర దూసుకుపోతోంది. సీజ్ ఫైర్ లోని... డార్లింగ్ రెబల్ లుక్స్ అందర్నీ కేక పెట్టిస్తోంది. ప్రభాస్ మేనియాను విశ్వవ్యాప్తం అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే ... కుప్పలు తెప్పలుగా కలోక్షన్లు వచ్చేలా చేస్తోంది. అయితే ఇండియా బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు... నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో కూడా..! ఎస్ ! నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఇప్పిటకే 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.