అదానీ గ్రూపునకు చెందిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం @Tv9telugudigital

ఉత్తరప్రదేశ్ లో అదానీ గ్రూపునకు చెందిన ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహరన్ పూర్ లోని ఈ గోదాంలో ఫార్చూన్, ఇతర బ్రాండ్ల వంట నూనె, నెయ్యి డబ్బాలు, పంచదార, పిండి, ఇతర నిత్యావసర సరుకులు భారీ స్థాయిలో నిల్వ ఉంచుతారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తారు. అగ్నిప్రమాదం కారణంగా నెయ్యి, నూనె డబ్బాలు పెద్ద శబ్దంతో విస్ఫోటనం చెందడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత అర్ధరాత్రి నుంచి మొదలైన మంటలు క్రమంగా గోదాం మొత్తానికి వ్యాపించాయి.