రెండున్నరేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి కొత్తరూపాన్ని ధరించి దాడి చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ కొత్త వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్‌వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అందించిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని తేల్చింది.