కార్తీకమాసం.. వీకెండ్.. వరుస సెలవులు.. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కాగా బోటు షికారు అంటే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో దూరప్రాంతాలనుంచి వచ్చినవారు దైవ దర్శనం అయిపోగానే సరదాగా కృష్ణానదిలో బోటు షికారు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ బోటు షికారు భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.