రఫా శిబిరంలో పాలస్తీనియన్ల స్థితి దారుణం - Tv9

గాజాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. తాజాగా రఫా శిబిరాలలో తలదాచుకున్న వందలాది మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు. స్థానికంగా వండి వార్చుతున్న ఆహారం వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా జనాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు పెద్ద డేగ్చాలు ఏర్పాటు చేసి వండుతున్న ఆహారం కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కరెంటు, తిండితో పాటు గుక్కెడు మంచి నీరు కూడా దొరకక పౌరుల బతుకు దుర్భరంగా తయారైంది.