Snake Found Hiding Under Seat

ద్విచక్ర వాహనంలో రక్తపింజర పాము కలకలం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని ఓ బైక్ మెకానిక్ షాపు వద్ద ఘటన. ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ద్విచక్ర వాహనంలో సాంకేతిక సమస్య రావడంతో అడ్డాకులలో బైక్ మెకానిక్ ను సంప్రదించిన ఇద్దరు యువకులు. బైక్ సీట్ తీసి చూస్తుండగా రక్తపింజర పాము దర్శనమివ్వడంతో ఖంగుతిన్న మెకానిక్. సుమారు గంటపాటు శ్రమించి పాముని బయటకు తీసిన మెకానిక్, యువకులు. దాదాపు 100 కిలోమీటర్లు బైక్ లోనే జర్నీ చేసిన రక్తపింజర.