గర్భిణీని 3 కి.మీ. డోలిలో మోసుకెళ్లి.. Alluri Sitharama Raju District - Tv9

అల్లూరి జిల్లా లో మారుమూల ప్రాంతాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక.. అత్యవసర సమయాల్లో వాహనాలు రాక డోలీలను ఆశ్రయిస్తున్నారు గిరిజనులు. తాజాగా నిండు గర్భిణీని ఆస్పత్రికి చేర్చడం కోసం ఏకంగా 3 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. పెదబయలు మండలం మూల లోవ కు చెందిన పార్వతమ్మకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో… గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీ కట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. రాళ్లు, రప్పలు, వాగులు దాతుకుంటూ 3కిలోమీటర్లు డోలీలో గర్భిణీని మోసుకెళ్లారు. తమకు రహదారి సౌకర్యం కల్పించి ఈ కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.