ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రకృతిలో మనకు సీజనల్‌ ఫ్రూట్స్‌ బాగా దొరుకుతాయి. ఆయా కాలాలను బట్టి మానవుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పండ్లు మనకు దొరుకుతాయి. కొన్ని రకాల పండ్లు చాలా రేర్‌గా దొరుకుతుంటాయి. అందుకే అవి ధర సామాన్యులకు అందనంతగా ఉంటుంది. ప్రస్తుతం సమ్మర్‌ సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌లో పుచ్చకాయలు, తర్బూజా పండ్లు బాగా దొరుకుతాయి. వీటి ధరలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కానీ పుచ్చకాయల్లో అత్యంత ఖరీదైన పుచ్చకాయ గురించి మీకు తెలుసా.