ఆడపిల్లలను చదువుకోడానికి పాఠశాలకు పంపించాలంటే భయపడే రోజులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారుణాలకు ఒడిగడుతున్నారు. విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి కామంతో రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు, బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు.