ఓ వైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ ఎగ్జామ్.. మరోవైపు ప్రాణాలనే కబళించే తాచుపాము కాటు. అయినా ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ ఆ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాశాడు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వై నిస్సి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉండగా.. పక్కనే ఉన్న ఓ రాయిపై వేలు పెట్టడంతో తాచుపాము కాటేసింది.