గుడ్లు పెట్టే వరకేనండోయ్‌.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్‌ ..

బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటిది టినమౌ నిప్పుకోళ్లలో మాతృత్వపు లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. ఆడ కోళ్లు అడవుల్లో నేల మీదే గూళ్లు కట్టి వాటిల్లో గుడ్లు పెడతాయి.