నాలుగేళ్ల వయసులో రికార్డు! - Tv9

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన చిన్నారి జారా సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల అతి పిన్న వయసులో ఏకంగా ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వరకు ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు స్థాపించింది. చెక్‌ దేశస్థురాలైనప్పటికీ జారా తన కుటుంబంతో కలిసి మలేసియాలో ఉంటోంది. ఇటీవల ఆమె తన తండ్రి డేవిడ్‌ సిఫ్రా, ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వద్దకు చేరుకుంది. ఆ దృశ్యాలను ఆమె కుటుంబం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘చిన్నారి జారా ఎప్పుడూ వేన్నీళ్లతో స్నానం చేయదనీ మంచు ముక్కలతో ఆడుకుంటుందని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.