ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను డార్లింగ్ ప్రభాస్, ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పార్ట్ 2 ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు ప్రభాస్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్‌ను సైలెంట్‌గానే ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ సీక్వెల్‌లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు.