లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్-దబేబా నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ఓ మంత్రి తెలిపారు. భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు చెప్పారు. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు రాయిటార్స్ తెలిపింది. వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ప్రభుత్వం మోహరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.