ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా, హుందాతనాన్ని ద్విగుణీకృతం చేసేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతోమంది మహిళలకు ఆసక్తి. చేనేత చీరలంటే ఎంతో ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిపిన సిల్క్ చీరలో ఆమె కన్పించారు.