పందెం కాశాడు.. ఓడిపోయాడు.. అరగుండు, అర మీసంతో కనిపించాడు.. ఇంతకీ ఏమిటా పందెం @Tv9telugudigital

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతో పాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పనీ చేశాడు. మీసం సగం వరకు షేవ్‌ చేయడంతోపాటు అర గుండు చేయించుకున్నాడు. మహాసముంద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసలేమైందంటే.. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆదివారం కౌంటింగ్‌ సందర్భంగా ఎలక్ట్రీషియన్ దేర్హా రామ్ యాదవ్ తన స్నేహితులతో పందెం కాశాడు.