ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్లలోపు బాలుడు ఆడుకుంటూ తమ ఇంటికి ఎదురుగా ట్రాక్‌పైన ఆగివున్న గూడ్సురైలు కిందికి వెళ్లాడు.