దక్షిణ గాజాలోని కొన్ని ప్రదేశాలపై ఇజ్రాయెల్ తాజాగా బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే దాడులు మొదలుపెట్టింది. అయితే జనమంతా ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస రావడంతో దాడులతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తమవుతోంది.