అఖండ 2 లో మోక్షజ్ఞ ఎగిరి గంతేస్తున్న బాలయ్య ఫ్యాన్స్ - Tv9

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.కానీ సాలిడ్ అప్డేట్ మాత్రం రాలేదు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.