భారతదేశంలో చదువుకోని పట్టభద్రులెందరో మట్టిలో మాణిక్యాల్లా ఉండిపోయారు. అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ప్రతిభావంతులెందరో వెలుగులోకి వస్తున్నారు. తాము చేసే పని సక్రమంగా, సులువైన మార్గాల్లో పూర్తి చేసేందుకు వారు చేసే ఆలోచనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఎలక్ట్రీషియన్ చేసిన తెలివైన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.