పంజాబీ బుల్లోడు. క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్ పై ప్రకంపనలు సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్ లో బాల్ బాల్ కి బ్యాండ్ బాజా మోగించడమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచకప్ లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్లు పోతే వీళ్లు.. వీళ్లు పోతే వాళ్లు కాదు.. సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్ మంటుంది. అతడే.. శుభ్ మన్ గిల్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే. అందుకే ఆ లిస్టులో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు. గిల్ అంటే ఏంటో చెప్పడానికి.