ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ఈసారి కూడా ఇదే చేశారు. కాకపోతే ఈసారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి గురూజీ ప్లాన్ ఏంటి? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుకానుంది..? అసలు బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ.