యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవలే దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.