సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి. వయసుతో సంబంధం లేకుండా ఈ రీల్స్‌లో మునిగిపోతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం రీల్స్ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకునేవారు కొందరైతే.. నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయి ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు.