ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికోసం రకరకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా సహజంగానే చర్మసౌందర్యాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మృదువుదనం కోల్పోయి ముడతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొల్లాజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్యలను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.