యూ ట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. చిక్కడు దొరకడు తరహాలో యూట్యూబర్ హర్షసాయి దాగుడు మూతలు ఆడుతున్నాడు. అత్యాచారం కేసు నమోదయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని జాడ కోసం నార్సింగి పోలీసులు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. హర్షసాయి విదేశాలకు పారిపోయే అవకాశం వుందని బాధితురాలు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు.