రక్తదానంపై ప్రచారం.. ఇప్పటికే పూర్తయిన 17 వేల కి.మీ నడక - @Tv9telugudigital

ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై అవగాహన కల్పించడానికి 21 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. 2021 డిసెంబర్ 28న కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇటీవల నాగాలాండ్​లోని కోహిమా జిల్లాకు చేరుకుంది. అక్కడి పర్యాటక మంత్రి తేంజెన్‌ ఇమ్నాతో కలిసి తీసుకున్న ఫొటోను తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో షేర్‌ చేశారు. 2025 డిసెంబరు 31 నాటికి 21 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలన్నదే కిరణ్ వర్మ లక్ష్యం. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు.