ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది

ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌ వానా ఒకటి. ఆఫ్రికా దేశమైన బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. అధిక నాణ్యత కలిగిన ఈ వజ్రం చెక్కుచెదరకుండా ఉందని లుకానా తెలపింది.