విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడున్నర లక్షల రుణం లభించనుంది. రుణంలో 75శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీంతో ఏటా 22లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుందన్నారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.