అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో

ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది బిఐఎస్. 2016 చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు.