ఊటీ ప్లాన్ చేశారా.. అయితే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి - Tv9

భారీ వర్షలతో తమిళనాడు వణికిపోతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాల కారణంగా తమిళనాడులో 7 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా కొన్ని జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.