ఐటీ ఉద్యోగుల పాలిట డెవిల్ లా మారిన డెవిన్ .. - Tv9

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏఐ టెక్నాలజీతో భారీగా ఉద్యోగాల కోత తప్పదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐ రాకతో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత ఉండదని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏఐ రంగం డేటా సెర్చ్‌, ఫొటోలు డిజైనింగ్ వరకు మాత్రమే పరిమితమైంది.