కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా Covid Side Effects

కోవిడ్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ జనాల్ని వెంటాడుతున్నాయా..? అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వ సాధారణమైపోయిందా..? గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ తరహా చర్చలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.