నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీ సహా తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్ 2వ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది.. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.